నమ్మలేనంత తక్కువ ధరకు గూగుల్ పిక్సల్ 6ఏ, నథింగ్ ఫోన్లు

  • ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా విక్రయం
  • రూ.27,699కే గూగుల్ పిక్సల్ 6ఏ
  • నథింగ్ ఫోన్ (1)పై రూ.5,000 తగ్గింపు
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అతి త్వరలోనే ఆరంభం కానుంది. 13వ తేదీ నుంచి మొదలు కావచ్చన్న అంచనాలున్నాయి. కాకపోతే  ఏ తేదీన మొదలయ్యేది ఫ్లిప్ కార్ట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, సదరు డిస్కౌంట్ సేల్ లో భాగంగా కొన్ని ఫోన్ల క్రేజీ డీల్స్ ను ఫ్లిప్ కార్ట్ ఇప్పటి నుంచే ప్రకటిస్తూ వస్తోంది. ఈ సందర్భంగా కొన్ని ఫోన్లపై నమ్మలేనంత డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

గూగుల్ పిక్సల్ 6ఏ రూ.40,000కు దేశీ మార్కెట్లో విడుదల కాగా, డిస్కౌంట్ తర్వాత కేవలం రూ.27,699కే ఈ ఫోన్ లభించనుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ర్యామ్ వెర్షన్ ఈ ధరకు రానుంది. అయితే ఇది ఫ్లాట్ డిస్కౌంట్ రూపంలోనా? లేక వేరేగానా? అన్నది ఫ్లిప్ కార్ట్ ఇంకా వెల్లడించలేదు. కార్డులపై డిస్కౌంట్ తోపాటు, పాత ఫోన్ ఎక్చేంజ్ పై ఈ ధరకు ఆఫర్ చేయడమా? అన్నది సేల్ మొదలైన తర్వాతే తెలియనుంది. 

ఇక నథింగ్ ఫోన్ (1) కూడా సైతం 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.28,999 ధరకే విక్రయానికి రానుంది. ప్రస్తుతం దీని అమ్మకం ధర రూ.33,999. రూ.5,000 వరకు తగ్గింపు రానుంది. ఈ రెండు ఫోన్లతోనూ చార్జర్ రాదన్న విషయాన్ని గమనించాలి. పాత చార్జర్ వాడుకోవడం లేదంటే కొత్త చార్జింగ్ అడాప్టర్ ను విడిగా కొనుగోలు చేసుకోవాల్సిందే.

Flipkart
Big Billion Days sale
phones
discount offers
Pixel 6a
Nothing Phone

More Telugu News